నమస్తే శేరిలింగంపల్లి: వేసవి కాలంలో ప్రజల సౌకర్యార్థం చలి వేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు భేరి రామచందర్ యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ బాపు నగర్ లో ఎన్ ఎన్ రెడ్డి టైలర్ షాపు యజమాని కుశల్ రెడ్డి ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని భేరి రాంచందర్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా చలివేంద్రం ఏర్పాటు చేస్తున్న కుశల్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితులలోనూ కుశల్ రెడ్డి మాస్కులు, శానిటైజర్లు, నిరుపేదలకు నిత్యవసర సరుకులను అందజేసినట్లు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నేతాజీ నగర్ కాలనీ ఉపాధ్యక్షులు రాయుడు, ఎండి సర్వర్, మౌలానా, ఎండి సాబీర్ భాయ్, టైలర్ అఫ్జల్, మొబైల్ షాప్ ఇస్మాయిల్, సలీం, అక్బర్, ఎండీ గౌస్ బాయ్, భేరీ చంద్ర శేఖర్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
