ఆర్టీసీ బస్సును ఢీకొట్టి ఆటో డ్రైవర్ మృతి – నిర్లక్యంగా పార్కింగ్ చేసిన ఆర్టీసీ డ్రైవర్ పై కేసు

నమస్తే శేరిలింగంపల్లి: ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఆటో ఢీకొట్టడంతో తీవ్ర గాయాలకు గురైన ఆటో డ్రైవర్ చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.  మియాపూర్ పోలీసుల కథనం ప్రకారం శనివారం మధ్యాహ్నం మియాపూర్ బస్ డిపో దగ్గర పార్కింగ్ చేసిన ఏపీ‌ 28 జడ్ 837 నంబర్ గల ఆర్టీసీ బస్సును మియాపూర్ నుండి బాచుపల్లి వైపు వెళ్తున్న టీఎస్ 15‌టీఆర్ 7819 ఆటో వెనక నుంచి ఢీ‌ కొట్టడంతో ఆటో డ్రైవర్ పూజారి రాము(41) తీవ్ర గాయాలకు గురయ్యాడు.

ఆర్టీసీ బస్సు ను ఢీకొట్టి నుజ్జునుజ్జు అయిన ఆటో

చికిత్స నిమిత్తం ఈఎస్ఐ ఎర్రగడ్డ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి 9 గంటల సమయంలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. రోడ్డు పక్కన నిర్లక్ష్యంగా ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా పార్కింగ్ చేసిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ వినోద్ కుమార్ పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు‌ చెప్పారు.

చికిత్స పొందుతూ మృతి చెందిన ఆటో డ్రైవర్ రాము

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here