నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ లోని శిల్పారామంలో డిస్ట్రిక్ట్ హ్యాండ్లూమ్ ఎక్స్ పో కు సందర్శకుల తాకిడి ఆదివారం పెరిగింది. ఎక్స్ పో సందర్బంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో వర్ణ ఆర్ట్స్ అకాడమీ స్మిత మాధవ్ శిష్య బృందం ప్రదర్శించిన భరతనాట్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. పుష్పాంజలి, వాహన అలరింపు, గణేశా కౌతం, అంబ పంచరత్నం, వర్ణం, పురందర దశ కీర్తన, లింగాష్టకం, వేలై తామరై, మురుగనీన్, కరుణ దేవమే, తిల్లాన అంశాలను ప్రదర్శించి మెప్పించారు. ప్రదర్శించిన కళాకారులు భార్గవి పరమేశ్వరన్, శ్రేయ, సహన, శ్రద్ధ, స్మ్రితి బాలాజీ ప్రదర్శించి మెప్పించారు.