శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని గచ్చిబౌలి డివిజన్ నేతాజీ నగర్ కాలనీలో చిట్యాల ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ చిట్యాల ఐలమ్మ చాకలి ఐలమ్మగా గుర్తింపు పొందిన తెలంగాణ ఉద్యమకారిణి, వీరవనిత అని అన్నారు. తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత, సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన స్త్రీ ధెైర్యశాలి అని అన్నారు. 2022 నుండి తెలంగాణ ప్రభుత్వం ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహిస్తోంది. దొరోడు ఏం చేస్తాడ్రా అని మొక్కవోని ధెైర్యంతో రోకలి బండ చేతబూని గూండాలను తరిమి కొట్టింది అని అన్నారు.
కాలినడకన వెళ్లి దొరకు సవాలు విసిరింది. అయిలమ్మ భూపోరాటం విజయంతో పాలకుర్తి దొర ఇంటిపై కమ్యూనిస్టులు దాడిచేసి ధాన్యాన్ని ప్రజలకు పంచారు. 90 ఎకరాల దొర భూమిని కూడా ప్రజలకు పంచారు. అయిలమ్మ భూపోరాటంతో మొదలుకొని సాయుధ పోరాటం చివరి వరకు నాలుగు వేలమంది ఉత్పత్తి కులాల వారు అమరులయ్యారు అని అన్నారు. 10 లక్షల ఎకరాల భూమి పంపకం జరిగింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్.హరికృష్ణ చారి, బేరి చంద్రశేఖర్ యాదవ్, సత్యమ్మ, నీలమ్మ, కుమ్మరి కుంట్ల సౌజన్య, కంపాటి మల్లమ్మ, కుమ్మరి కుంట్ల కోటమ్మ, సాకలి నాగరాజు. రజక రసాల బాలు, మహేందర్, శ్రీనాథ్, సతీష్, శేఖర్, కృష్ణ, అశోక్, రాజేష్, గురుమూర్తి సాగర్ పాల్గొన్నారు.