శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ సురేష్ నాయక్ కుటుంబన్ని టీపిసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సురేష్ నాయక్ నిబద్దత కలిగిన కాంగ్రెస్ నాయకుడని అన్నారు. ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా చివరి శ్వాస వరకు కాంగ్రెస్ కోసం కృషి చేసిన వ్యక్తి సురేష్ నాయక్ అని, అటువంటి వ్యక్తిని కోల్పోవడం బాధాకరమని అన్నారు. సురేష్ నాయక్ చనిపోయిన బాధతో ఆయన తల్లి కూడా పది రోజుల క్రితం మరణించడం తనను తీవ్ర దిగ్బ్రాంతికి గురించేసిందని అన్నారు. వారి కుటుంబనికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అయన తెలిపారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ శేరిలింగంపల్లి ఇంచార్జి జగదీశ్వర్ గౌడ్, జెరిపేటి జైపాల్, ఎర్రగుoడ్ల శ్రీనివాస్ యాదవ్, మహిపాల్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.