నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరించి అభివృద్ధి చేస్తామని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ అన్నారు. హాఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని శాంతి నగర్ లో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను స్థానిక నాయకులతో కలిసి కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ పరిశీలించారు. హాఫీజ్ పెట్ డివిజన్ అభివృద్ధికి బాటలు వేస్తూ, మౌళికవసతుల కల్పనకు పెద్దపీట వేస్తామని అన్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని చెప్పారు. డివిజన్ అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన మున్సిపల్ శాఖమంత్రి కేటీఆర్ కు,చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు హమీద్, అక్బర్, రంగయ్య, శ్రీకాంత్, వేణు, ప్రవీణ్, రాములు తదితరులు పాల్గొన్నారు.