కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించిన ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: కరోనా థర్డ్ వేవ్ పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు పాటించాలని, ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ‌సూచించారు. సోమవారం హాఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 15 – 18 సంవత్సరాల వయస్సు గల వారికి ప్రత్యేక కొవిడ్ టీకా కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్, మియపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. కరోనా వ్యాధిని అరికట్టేందుకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, విధిగా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న కోవిడ్ వాక్సినేషన్ ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు తమ తమ పిల్లలకు తప్పనిసరిగా టీకా వేయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నల్ల సంజీవ రెడ్డి, కృష్ణ ముదిరాజ్, లక్ష్మ రెడ్డి, హాఫీజ్ పెట్ డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్,హాఫీజ్ పెట్ డివిజన్ టిఆర్ఎస్ గౌరవ అధ్యక్షులు వాలా హరీష్ రావు,ఉపాధ్యక్షులు షైక్ జామీర్, హాఫీజ్ పెట్ డివిజన్ మైనారిటీ అధ్యక్షులు సయ్యద్ సాదిక్ హుస్సేన్, వార్డ్ సభ్యులు శేఖర్ ముదిరాజ్, కనకమామిడి వెంకటేష్ గౌడ్, హఫీజ్ పెట్ డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కంది జ్ఞనేశ్వర్, సంగా రెడ్డి, దామోదర్ రెడ్డి, పద్మ రావు, శంకర్, సురేశ్, రఘునాథ్, వెంకట్ సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

కరోనా వ్యాక్సిన్ ను పరిశీలిస్తున్న ప్రభుత్వ ‌విప్ గాంధీ, కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here