నమస్తే శేరిలింగంపల్లి: ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, రాష్ట్ర అబ్కారీ, క్రీడాపర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను టీజీఓ కేంద్ర సంఘం మర్యాదపూర్వకంగా కలిసింది. సంఘం అధ్యక్షురాలు మమత, ప్రధాన కార్యదర్శి ఎ. సత్యనారాయణ, కోశాధికారి పుల్లెంల రవీందర్ కుమార్ గౌడ్, సహదేవ్, వెంకటయ్య, అరుణ్ కుమార్ తదితరులు మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ కు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణ యాదవ్ మాట్లాడుతూ హైదరాబాద్ జిల్లాలోని ఉద్యోగులందరూ 2022లో ఇంకా ఉత్సాహంగా పని చేసి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ కొత్త తరం హైదరాబాద్ నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కార్యదర్శి డాక్టర్ హరికృష్ణ, చంద్రశేఖర్, ఖాదర్, శ్రీనేష్, గోపీచంద్ తదితరులు ఉన్నారు.