నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ అభివృద్ధికి నిధులు మంజూరు చేసి సమస్యలను పరిష్కరిస్తున్నామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని చంద్ర నాయక్ తండా నుండి పార్వతీ నగర్ జంక్షన్ వరకు నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును స్థానిక ప్రజలు, నాయకులతో కలిసి పరిశీలించారు. మాదాపూర్ డివిజన్ అభివృద్ధికి దశల వారీగా నిధులు మంజూరు చేస్తున్నామని ప్రభుత్వ విప్ గాంధీ అన్నారు. కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, ప్రభుత్వ విప్ గాంధీ సహకారంతో అభివృద్ధి పనులు చేస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు సయ్యద్ గౌస్, హున్యా నాయక్, మాదాపూర్ డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, మాదాపూర్ డివిజన్ ఎస్టీ సెల్ అధ్యక్షులు లాలూ నాయక్, డివిజన్ నాయకులు సాంబయ్య, నర్సింహ, రాములు, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వెంకటేష్ గుప్త, రాజు, అశోక్, శ్రీనివాస్ గుప్త, లక్ష్మినారాయణ, రామాంజనేయులు, ఖున్యా, ఉన్నూర్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.