నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గుల్మొహర్ పార్క్ లైబ్రరీలో ఏర్పాటు చేసిన కరోనా మొబైల్ వ్యాక్సినేషన్ ను సద్వినియోగం చేసుకోవాలని నేతాజీ నగర్ కాలనీ అధ్యక్షుడు భేరీ రామచందర్ యాదవ్ పిలుపునిచ్చారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను గుల్ మొహర్ పార్క్ కాలనీ అధ్యక్షుడు షేక్ ఖాసిం, ఉపాధ్యక్షుడు మోహన్ రావుతో కలిసి పరిశీలించారు. బిల్ కలెక్టర్ హరి కాంత్ రెడ్డి, మల్లికార్జున్, నాగరాజు, ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది ఈశ్వర్, రాజేష్ రాయుడు, బాలాజీ నాయక్, సూపర్ వైజర్ ఉమారాణి, సుజాత, శ్రీలత, నీరజ, వంశీ, రూబియా, మహేష్, లక్ష్మణ్, అంబదాస్, కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.