నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల చెరువు కట్ట వద్ద రజకుల కోసం దోబీ ఘాట్ నిర్మాణం చేపట్టాలని జాతీయ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రాంచందర్ యాదవ్ ఆధ్వర్యంలో శుక్రవారం జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ స్వప్న రెడ్డి కి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రజకులు 20 కుటుంబాలు కుల వృత్తి మీద ఆధారపడి బతుకుతున్నారని, వారికి ప్రభుత్వం దోబీ ఘాట్ లు నిర్మించి ఇవ్వాలని బీసీ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. రజక సంఘం అధ్యక్షుడు కె నరేందర్ మాట్లాడుతూ అనాదిగా రజక కుటుంబాలు కుల వృత్తి మీదనే ఆధారపడి బతుకుతున్నారని అన్నారు. మాకు వేరే జీవనాధారం లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం మాకు దోబిఘాట్ నిర్మించి మా కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం ఉపాధ్యక్షుడు పాండు, ప్రధాన కార్యదర్శి శోభ, ఉప కార్యదర్శి ఎం మల్లేష్, కోశాధికారి బి రవి, కార్యదర్శులు ఎం రాజు, ఎం మారయ్య, ఎస్ కంచమ్మ, బి రాజు, ఎం శ్రీనివాస్, ఎం కుమార్, కే శ్రీశైలం, కే బాబు, కే శివకుమార్, రజక సంఘం సభ్యులు పాల్గొన్నారు.