నమస్తే శేరిలింగంపల్లి: గణేష్ ఉత్సవాలను పురస్కరించుకుని లక్మి విహార్ ఫేస్ 2 కాలనీలో బుర్రకథ గానం ఏర్పాటు చేశారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత స్వర్గస్రీ నాజర్ బాబు కుమారులు పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అధ్యాపకులు కళారత్న S K బాబుజి బుర్రకథ గానం చేశారు. మహాభారతంలోని వీరభిమాన్యు “పద్మవ్యూహం”అనే శీర్షికన రెండు గంటలపాటు సభికులను మైమరిపించారు.
రెండు గంటలపాటు కాలనీవాసులు వారి బంధుమిత్రులతో పాటు పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్ నాగేందర్ యాదవ్, కాలనీ అధ్యక్షులు రవీంద్ర ప్రసాద్ దుబే హాజరై కళాకారులను సత్కరించారు. అనంతరం విప్ గాంధీ మాట్లాడుతూ ఈ హైటెక్ ప్రపంచంలో అత్యధిక సాప్ట్ వేర్ ఉద్యోగులున్న లక్ష్మీవిహార్ కాలనీలో బుర్రకథ గానం చేయించి కళాకారులను సత్కరించటం చాలా గొప్పవిషయమని సంతోషం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ, ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, ఉపాధ్యక్షులు నర్సింహా రావు, కార్యదర్శులు చిత్రభాను, ఝాన్సీ రాణి, విద్యాసాగర్, రాజు అల్లూరి పాల్గొన్నారు.