లింక్ రోడ్డును త్వరితగతిన పూర్తిచేయాలి – అధికారులకు విప్ గాంధీ ఆదేశం

లింక్ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలిస్తున్న విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్, నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని, అన్నివేళలా ప్రజలకు అందుబాటులోకి ఉంటానని ప్రభుత్వ విప్ గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని మై హోమ్ మంగళ నుండి శేరిలింగంపల్లి జోనల్ ఆఫీస్ కు వెళ్ళడానికి వీలుగా వేసిన HRDCL లింక్ రోడ్డును HRDCL , జలమండలి అధికారులు మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ HRDCL అధికారులు, జలమండలి అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని ,ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సమన్వయంతో పని చేయాలన్నారు. అవసరము ఉన్న చోట మంచి నీటి పైప్ లైన్ మరియు డ్రైనేజి పైప్ లైన్ నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన వెంటనే పూర్తి చేయాలని, రోడ్డు నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని పేర్కొన్నారు. అదేవిధంగా స్ప్రింగ్ వ్యాలీ అసోషియేషన్ వారి సమస్యలను పరిష్కరిస్తామని, అదేవిధంగా జోనల్ ఆఫీస్ కు వెళ్లే HRDCL రోడ్డుకు కలిసే వీలుగా నూతనంగా నిర్మించబోయే లింక్ రోడ్డు ను పరిశీలించానని, ఈ లింక్ రోడ్డు నిర్మాణం వెంటనే చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ప్రజల రవాణా సౌకర్యార్థం ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయ రోడ్డును నిర్మించేలా తగు చర్యలు తీసుకోవాలని, పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి రోడ్డును తీసుకురావలని , ఈ లింక్ రోడ్డు ఇక్కడి పరిసర ప్రాంత ప్రజలకు, కాలనీ వాసులకు ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులకు చెప్పారు.

లింక్ రోడ్ నిర్మాణం గురించి ఎమ్మెల్యేకు వివరిస్తున్న అధికారులు

ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షులు మారబోయిన రాజు యాదవ్, తెరాస నాయకులు పద్మారావు, రమణి, పవన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here