నమస్తే శేరిలింగంపల్లి: ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్ లక్షంగా పోరాడుతున్న ఇద్దరు ఆర్టిజన్ కార్మికులు మృతి చరిత్రలో నిలిచిపోతుందని 327 ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్ వచ్చేంత వరకు పోరాటాన్ని ఆపొద్దని అంకం బుచ్చిరాజు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకోగా, చలో వరంగల్ సభ నుంచి తిరిగి వస్తూ జె.రవిందర్ మృతి చెందిన విషయం విదితమే. కాగా వారిరువురి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ బాలజీనగర్‌లోని సబ్‌స్టేషన్ ఆవరణలో తోటి కార్మికులు కొవ్వత్తుల ప్రదర్శన చేశారు.

ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఇద్దరు ఆర్టిజన్ కార్మికుల మృతికి ప్రభుత్వమే భాద్యత వహించాలని, వారు ఏలక్ష్యం కోసమైతే తనువు చాలించారో ఆ న్యాయమైన కోరికలను తీర్చి వారికి ఆత్మకు శాంతి చేకూర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్. రమేష్, కార్మికులు యాదయ్య, సంతోష్, రాజశేఖర్, మల్లేష్, శ్రీనివాస్, రంగప్ప,సోమేశ్, గౌస్, నాగరాజ్, మైపాల్ రెడ్డి, శేఖర్, శ్యామసుందర్, అబ్దుల్, లక్ష్మణ్, పోలయ్య, శ్రీనునాయక్, సతీష్ నాయక్, కృష్ణారెడ్డి, మోహన్, పృథ్వీరాజ్, నరేందర్ తదితరులు పాల్గొని మృతుల చిత్ర పటాలకు నివాళులర్పించారు.
