బీఆర్ఎస్ పార్టీ ర‌జ‌తోత్స‌వ స‌భ‌ను విజ‌య‌వంతం చేయాలి: కొమిరిశెట్టి సాయిబాబా

శేరిలింగంపల్లి, ఏప్రిల్ 17 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈ నెల 27న వరంగల్ లో జరగనున్న బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు సన్నాహకంగా శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా నాయకత్వంలో గచ్చిబౌలి డివిజన్ ముఖ్య నాయకుల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య అజెండా ర‌జతోత్సవ సభను విజయవంతం చేయడానికి గులాబీ కండువా కప్పుకున్న ప్రతి కార్యకర్త ముందుకు రావాలని సాయిబాబా అన్నారు. 25 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ గొప్ప తనాన్ని అందరికి తెలియజేయాల‌ని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డ్ మెంబర్లు, మాజీ ఏరియా మెంబర్లు, గచ్చిబౌలి డివిజన్ సీనియర్ నాయకులు, మహిళా నాయకురాళ్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here