శేరిలింగంపల్లి, ఏప్రిల్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): భారాస నిర్వహిస్తున్న రజతోత్సవ సభకు శేరిలింగంపల్లి నుంచి పెద్ద ఎత్తున ప్రజలను తీసుకురావాలని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ సీనియర్ లీడర్, శేరిలింగంపల్లి యువనేత రవీందర్ యాదవ్ కు సూచించారు. గురువారం తెలంగాణ భవన్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా రవీందర్ యాదవ్ కలిశారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి నుంచి పార్టీ సభను విజయవంతం చేసేలా ప్రతి ఒక్కరిని తీసుకురావాలని సూచించారు. పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తున్నట్లుగా రవీందర్ యాదవ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు తెలిపారు. ఇప్పటికే పలు సమావేశాలను నిర్వహించామని, ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. శేరిలింగంపల్లి గులాబీ దండును చూపిస్తామని రవీందర్ యాదవ్ స్పష్టం చేశారు. తెలంగాణ కోసం పని చేసే పార్టీ భారాస అని, ప్రత్యేక రాష్ట్రంను సాధించి అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ దేనని రవీందర్ యాదవ్ అన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచనలతో పెద్ద ఎత్తున శేరిలింగంపల్లి నుంచి ప్రజలు తరలి రావాలన్నారు. ఛలో వరంగల్ సభను విజయవంతం చేయాలని సూచించారు. పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు ముందుండాలని ప్రత్యేకంగా రవీందర్ యాదవ్ కోరారు.