శేరిలింగంపల్లి, జూలై 15 (నమస్తే శేరిలింగంపల్లి): ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SIR) కార్యక్రమంపై బీఆర్ఎస్ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. చందానగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి శేరిలింగంపల్లి బీఆర్ఎస్ ఇంచార్జి, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో BLAలు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు SIR ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ, SIR కార్యక్రమంపై ప్రజల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత పార్టీ నాయకులు, BLAలపై ఉందన్నారు. ఎప్పటికప్పుడు BLOలు, ఎన్నికల అధికారులతో సమన్వయం చేసుకుంటూ సమస్యలు ఎదురైతే వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి మాట్లాడుతూ, ఓటర్లు ఇంటి వద్ద అందుబాటులో లేకపోతే వారి వివరాలను సేకరించి BLOలకు అందించి వారి ఓటు హక్కును పరిరక్షించాలని అన్నారు. ఓటు ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు అని, అధికారులు ఇంటికి వచ్చినప్పుడు ప్రజలకు ఉన్న సందేహాలను అక్కడికక్కడే నివృత్తి చేసి, అవసరమైన దరఖాస్తులను నింపించేందుకు సహకరించాలని సూచించారు. ఈ సమావేశంలో BLAలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





