గోపన్‌పల్లిలో SIRలో పాల్గొన్న బీఆర్ఎస్ నేతలు.. ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ..

శేరిలింగంప‌ల్లి, జూలై 15 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): నల్లగండ్ల డివిజన్ పరిధిలోని గోపన్‌పల్లి వీకర్ సెక్షన్ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొని ఓటరు జాబితాను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నల్లగండ్ల డివిజన్ బీఆర్ఎస్ నాయకులు రాగం హరి శంకర్ యాదవ్, శంకరి రాజు ముదిరాజ్, ఇండ్ల రాణిలు BLOలతో కలిసి ప్రజలకు ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేశారు. ఫారాలు అందుకున్న వెంటనే అక్కడికక్కడే BLOలు, BLAల సహాయంతో ప్రజలతో వాటిని పూర్తిగా పూరింపజేసి, అవసరమైన వివరాలను నమోదు చేయించారు.

అనంతరం ఓటర్లు పూరించిన ఎన్యూమరేషన్ ఫారాలను BLOలు, BLAలతో కలిసి పరిశీలించి, అవసరమైన వివరాలను ధ్రువీకరించిన అనంతరం సంబంధిత BLOలకు తిరిగి సమర్పించారు. ఈ సందర్భంగా రాగం హరి శంకర్ యాదవ్ మాట్లాడుతూస్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రతి అర్హుడైన ఓటరుకి అత్యంత కీలకమైన ప్రక్రియ అని అన్నారు. ప్రతి ఓటరు తమకు అందిన ఎన్యూమరేషన్ ఫారాన్ని తప్పనిసరిగా స్వీకరించి, అవసరమైన వివరాలను పూర్తిగా పూరించి, సంబంధిత ఆధార పత్రాలను జతచేసి నిర్ణీత గడువులోపు తమ పరిధి BLOల‌కు అందజేయాలని కోరారు. అలాగే ఫారాలను అందుకున్న వెంటనే BLOలు, BLAల సహకారంతో అక్కడికక్కడే పూరించడం ద్వారా ప్రక్రియను సులభతరం చేసుకోవచ్చని సూచించారు. ప్రతి కుటుంబం ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని, తమ ఓటరు వివరాలను సక్రమంగా నమోదు చేసుకోవడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రమేష్, శ్రీకాంత్, పరశురాం, సుందర్, నరేష్, బాలకృష్ణ, రికాష్, చరణ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here