వ‌ర్షాలు మొద‌లైన నేప‌థ్యంలో వ‌ర‌ద ముంపు ప్రాంతాల‌పై ప్ర‌త్యేక దృష్టి: ఉప్ప‌ల‌పాటి శ్రీకాంత్‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: మియాపూర్ డీవిజన్ పరిధిలోని బీకే ఎన్‌క్లేవ్‌లో స్థానిక కార్పొరేట‌ర్ ఉప్ప‌ల‌పాటి శ్రీకాంత్ సోమ‌వారం ప‌ర్య‌టించారు. బికె ఎన్‌క్లేవ్‌తో పాటు బొల్లారం మెయిన్ రోడ్డు పరిసర ప్రాంతంలో కొన‌సాగుతున్న నాలా పూడికతీత పనులను జీహెచ్ఎంసీ ఏఈ ర‌మేష్ ర‌మావ‌త్‌తో క‌ల‌సి ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ వ‌ర్షాలు మొద‌లైన నేప‌థ్యంలో వ‌రద ముంపు ప్రాంతాల‌పై ప్ర‌త్యేక దృష్టి సారిస్తున్న‌ట్టు తెలిపారు. వ‌ర‌ద‌నీటి కాలువ‌లు, నాల‌ల పూడిక‌తీత పూర్త‌య్యింద‌ని, ఎక్క‌డైన మిగిలిపోయిన ప‌నుల‌ను యుద్ధ ప్రాతిప‌ధ‌క‌న చేప‌డుతున్న‌ట్టు తెలిపారు. వ‌ర్షాబావ ప‌రిస్థితుల నేప‌థ్యంలో ముంపు ప్రంతాల విషయంలో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారుల‌కు ఆయ‌న సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో వ‌ర్క్ఇన్‌స్పెక్ట‌ర్ విశ్వ‌నాథ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

నాలా పూడిక‌తీత ప‌నుల‌ను ప‌రిశీలిస్తున్న కార్పొరేట‌ర్ ఉప్ప‌ల‌పాటి శ్రీకాంత్‌, ఏఈ ర‌మేష్ త‌దిత‌రులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here