నమస్తే శేరిలింగంపల్లి: డివిజన్ పరిధిలోని ఆదర్శ్ నగర్ కాలనీలో స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సోమవారం పాదయాత్ర నిర్వహించారు. స్థానికంగా కొనసాగుతున్న నాలాల నిర్మాణ పనులను పరిశీలించారు. అదేవిధంగా స్థానికంగా నెలకొన్న ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ముస్లిం గ్రేవ్ యార్డులో వరద నీరు వస్తుందని స్థానిక ముస్లింలు కార్పొరేటర్ దృష్టికి తీసుకురాగా తక్షణమే స్పందించిన రాగం నాగేందర్ యాదవ్ గారు అధికారులను పిలిపించి సమస్య తీవ్రతను వివరించారు. సమస్య పునరావృతం కాకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈ శ్రీనివాస్, నాయకులు గఫ్ఫార్, శ్రీకాంత్, జాఫర్, అక్బర్, గఫుర్, ముఖరమ్, జఫర్ ఇబ్రాహీం, అఫ్జల్, షేక్ ఖాలీల్, షకీల్, లింగం,సలీం,ఫక్రుమ్ తదితరులు పాల్గొన్నారు.