వివేకానందనగర్ (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని వివేకానందనగర్ డివిజన్ ఆర్పీ కాలనీలో ప్రజా సమస్యలపై బీజేపీ నాయులు పోరుబాట కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా డివిజన్ బీజేపీ అధ్యక్షుడు నర్సింగ్ రావు ఆధ్వర్యంలో నాయకులు ఉప్పల ఏకాంత్ గౌడ్, చౌదరి ధర్మారావు, శ్రీహరియాదవ్, పర్వతాలు యాదవ్, భాస్కర్ రెడ్డి, డివిజన్ ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్, రాజు, భాస్కర్ గౌడ్ లు కాలనీలో పాదయాత్ర చేసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
స్థానిక ప్రజలు మాట్లాడుతూ.. చిన్నపాటి వర్షాలకే రోడ్లు చెరువులుగా మారుతున్నాయని అన్నారు. డ్రైనేజీ పొంగి రోడ్లపైకి వస్తుందని, అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సమస్య పరిష్కరించడం లేదని వాపోయారు. స్థానిక ప్రజలు తెలియచేసిన సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని బీజేపీ నాయకులు ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బీజేపీ నాయకురాలు దుర్గా, అశోక్, కల్యాణ్, కృష్ణ, రాజు, శ్రీనివాస్, లక్ష్మి, చందు, ప్రియా, హారిక, శైలజ, పుష్పేందర్, భాస్కర్, చందు తదితరులు పాల్గొన్నారు.