ఆల్విన్ కాలనీ (నమస్తే శేరిలింగంపల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని గణేష్ నగర్ కాలనీలో కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ స్థానిక సమస్యలపై ఆదివారం బస్తీ బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు.. కాలనీలోని డ్రైనేజీ లైన్ ప్రధాన లైన్ కంటే దిగువన ఉండటంతో వర్షం కురిసినప్పుడు నీరు వెనక్కి వచ్చి ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆయనకు తెలియజేశారు.
కార్పొరేటర్ స్పందిస్తూ.. నెలరోజుల లోపు డ్రైనేజీ నీరు రోడ్డుపై నిలవకుండా ప్రత్యామ్నాయంగా ప్రధాన రోడ్డు వద్ద ఉన్న డ్రైనేజీ కి అనుసంధానం చేసే డ్రైనేజీ లైను విస్తరిస్తామని కాలనీవాసులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ తెరాస యువ నాయకుడు దొడ్ల రామకృష్ణ గౌడ్, డివిజన్ అధ్యక్షుడు జిల్లా గణేష్, నాయకులు అర్వె రవి, శ్యామ్, యాదగిరి, పులియ, వెంకటేష్, రాజు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.