బిజెపి అంటే నిజాయతీ, అభివృద్ధి: రవికుమార్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, ఫిబ్ర‌వ‌రి 5 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మొయినాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ కార్యాలయంలో శేరిలింగంపల్లి నియోజకవర్గానికి కేటాయించిన వార్డులలో చేపట్టబోయే కార్యాచరణ , ప్రణాళికలపై ముఖ్య నాయకులతో కలిసి చర్చించి అనంతరం ముర్తాజ్ గూడా , ఎన్కెపల్లి గ్రామాలలో బీజేపీ కౌన్సిలర్లుగా పోటీ చేస్తున్న అభ్యర్థులను కమలం పువ్వు గుర్తు పై ఓటు గెలిపించాలని కోరుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ నాయకులతో కలిసి బీజేపీ శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలు అంటే మన పట్టణ , మన వార్డు ఎన్నికలని, ఎవరైతే నిజాయతీగా , మన వార్డు ను అభివృద్ధి చేస్తారో వారిని గెలిపించాలని అన్నారు. బిజెపి అంటే నిజాయతీ, అభివృద్ధి అని, మన ఓటుతో మన కోసం మనతో ఉంటూ పని చేసే నాయకులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మహిపాల్ రెడ్డి, రాష్ట్ర నాయకుడు బుచ్చిరెడ్డి, ప్రభాకర్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు అనిల్ గౌడ్, జిల్లా కార్యదర్శి దుర్గా ప్రసాద్, సీనియర్ నాయకులు స్వామి గౌడ్, గోవర్ధన్ గౌడ్, నరేందర్ ముదిరాజ్, రామిరెడ్డి, అజిత్, డివిజన్ అధ్యక్షులు జితేందర్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here