శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 5 (నమస్తే శేరిలింగంపల్లి): జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి ఆధ్వర్యంలో చేసిన ఫిర్యాదుతో ప్రభుత్వ యంత్రాంగం కదిలి వచ్చింది. శేరిలింగంపల్లిలోని హఫీజ్ పేట రేగుల కుంట సర్వే నెంబర్ 151 లో 370 గజాల కబ్జాపై వాల్టా యాక్ట్ 2002 ప్రకారం తహసీల్దార్ కం ఎక్స్ అఫీషియో చైర్మన్ వెంకారెడ్డి నోటీసులు జారీ చేశారు. ఈ సందర్బంగా కసిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ 4 ఫ్లోర్ల నిర్మాణం తర్వాత ఇప్పుడు వాల్టా చట్టం గుర్తుకు రావడం విశేషమని అన్నారు. వాల్టా చట్టం ప్రకారం గతంలో హైకోర్టు ఇచ్చిన రెండు ఆదేశాలను ఉటంకిస్తూ నోటీసులు జారీ చేసిందన్నారు.





