గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఖాజాగూడలో బీజేపీ నాయకులు శనివారం రాత్రి రోడ్లను పరిశీలించారు. రోడ్లపై మోకాళ్ల లోతులో నీరు ప్రవహిస్తుందని, ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇళ్లు, దుకాణాల్లోకి నీరు చేరిందని, ప్రజాప్రతినిధులు, అధికారులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బీజేపీ మాజీ అధ్యక్షుడు నక్క నరేందర్ గౌడ్, సీనియర్ నాయకుడు స్వామి గౌడ్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ చారి, డివిజన్ బీజేవైఎం అధ్యక్షుడు నక్క శివకుమార్ పాల్గొన్నారు.