ప్రధాని మోదీ సభకు భారీగా తరలిన బీజేపీ నేతలు

శేరిలింగంప‌ల్లి, మే 10 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): వివిధ అభివృద్ధి పనుల ప్రారంభ, శంకుస్థాపనకు తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్‌లో హాజ‌రైన‌ భారీ బహిరంగ సభకు శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలి డివిజన్ ఎన్టీఆర్ నగర్ బీజేపీ కార్యాలయం నుండి భారీ సంఖ్య‌లో నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, యువ మోర్చా, కిసాన్ మోర్చా, బీజేవైఎం, ఓబీసీ మోర్చా, ఎస్సీ మోర్చా నాయకులు తరలివెళ్లారు. గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ వి గంగాధర్ రెడ్డి ఆదేశాల మేరకు కార్యకర్తలు సమన్వయంతో సభకు హాజరయ్యారు. మోదీ నాయకత్వంలో దేశాభివృద్ధి, తెలంగాణ ప్రగతే లక్ష్యంగా భారీ ఎత్తున కార్యకర్తలు సభకు తరలివెళ్లిన‌ట్లు బీజేపీ నాయ‌కులు తెలిపారు. సబ్కా సాథ్ – సబ్కా వికాస్ నినాదాలతో బీజేపీ శ్రేణులు ఉత్సాహంగా ముందుకు సాగాయి.

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, రహదారులు, రైల్వేలు, ఐటీ, మౌలిక వసతులు, యువత ఉపాధి అవకాశాల కల్పనలో మోదీ ప్రభుత్వం కీలకంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీకి రోజు రోజుకూ ప్రజాదరణ పెరుగుతోందని, రాబోయే రోజుల్లో పార్టీ మరింత బలపడుతుందని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here