నమస్తే శేరిలింగంపల్లి: మహబూబ్ నగర్ – రంగారెడ్డి -హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా మక్తల్ బిజెపి అర్బన్, రూరల్ మండల శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పచ్చీస్ ప్రభారీ మండల సమావేశానికి ముఖ్యఅతిథిగా రంగారెడ్డి జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్, మక్తల్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జ్ నంద కుమార్ యాదవ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకులు, మక్తల్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, బిజెపి అర్బన్, రూరల్ మండల నాయకులు, కార్యకర్తలు, పన్నా ఇన్చార్జులు పాల్గొన్నారు.

