మోదీ చిత్రపటానికి బిజెపి నాయకుల క్షీరాభిషేకం

నమస్తే శేరిలింగంపల్లి: ఆజాదీ కా మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా కరోనా మహమ్మారి వ్యాధికి గురికాకుండా బూస్టర్ డోస్ లను ఉచితంగా అందిస్తున్న నరేంద్ర మోడీ చిత్రపటానికి బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. హఫీజ్ పేట్ డివిజన్ లోని ప్రైమరీ హెల్త్ సెంటర్ ను స్థానిక బిజెపి పార్టీ నాయకులు సందర్శించి కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వ్యాక్సినేషన్, బూస్టర్ డోస్ ల గురించి ప్రజలందరికీ అవగాహన కల్పించి అక్కడి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అజాదీ కా అమృతోత్సవ్ కార్యక్రమంలో భాగంగా దేశంలో 18 ఏండ్లు నిండిన వారికి బూస్టర్ డోస్ ను ఉచితంగా ప్రజలకు అందిస్తున్న ప్రధాని నరేంద్రమోడీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే ప్రతి ఒక్కరికి ఉచితంగా కరోన ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ ఇచ్చిన కేంద్ర సర్కార్ ఇప్పుడు బూస్టర్ డోస్ సైతం ఉచితంగా ఇస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం సెకండ్ డోస్ కు బూస్టర్ డోస్ మధ్య గ్యాప్ ను 9 నెలల నుంచి 6 నెలలకు తగ్గించిందని దీంతో కరోనా వైరస్ ను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. 18 నుంచి 59 ఏళ్ల వయసు ఉన్న ప్రతి ఒక్కరూ విధిగా బూస్టర్ డోస్ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వర్ గౌడ్, శ్రీధర్ గౌడ్, మహేష్ యాదవ్, కంచర్ల ఎల్లేశ్, పృథ్వి గౌడ్, రవి గౌడ్, జితేందర్, అశోక్, రవి ముదిరాజ్, నవీన్, వినోద్ యాదవ్, రామకృష్ణ, బాబు, కృష్ణం రాజు తదితరులు పాల్గొన్నారు.

మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న బిజెపి నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here