నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని తారానగర్ తుల్జా భవాని అమ్మవారి ఆలయంలో నూతనంగా నిర్మాణం చేపట్టిన ప్రాకార మండపాన్ని స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు చైర్పర్సన్ రాగం సుజాత యాదవ్ వేద బ్రాహ్మణులచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాకార మండపం నిర్మాణం చేసుకోవడం వల్ల అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులకు పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు.

ఆలయంలోని ప్రాకార మండప నిర్మాణానికి విరాళాలను అందజేసిన భక్తులను బి.కే. రాఘవ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ చంద్రారెడ్డి, బి.కే. రాఘవ రెడ్డి, బచ్చు రాజన్న, వీరేశం గౌడ్, రాంచందర్, రాజశేఖర్ రెడ్డి, గోవింద్ చారి, సత్తయ్య ముదిరాజ్, జనార్దన్ గౌడ్, గోపాలకృష్ణ, పాండు ముదిరాజ్, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, గోపాల్ యాదవ్, పట్లోళ్ల నరసింహ, సాయి, మల్కయ్య, రామచందర్, ఆలయ నిర్వాహక కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
