అంగ‌న్‌వాడీ స్కూల్‌కు విద్యుత్ క‌నెక్ష‌న్ ఏర్పాటు చేసిన బీజేపీ నాయ‌కులు

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 14 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): బిజెపి సేవా పక్షం కార్యక్రమంలో భాగంగా చందానగర్ డివిజన్ శివాజీ నగర్ అంగన్ వాడి స్కూల్ ను బీజేపీ నాయకులు సందర్శించారు. స్కూల్‌లో విద్యుత్ కనెక్షన్ లేక చాలా ఇబ్బందిగా ఉంద‌ని అంగన్‌వాడి స్కూల్ టీచర్ తెలిపారు. భారతీయ జనతా పార్టీ చందానగర్ డివిజన్ తరపున సొంత నిధులతో కరెంటు మీటర్ ఏర్పాటు చేసి అంగన్‌వాడి స్కూల్ కు విద్యుత్ కనెక్షన్ ఇప్పించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు గొల్లపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు గొల్లపల్లి రామిరెడ్డి, సీనియర్ నాయకుడు శ్రీనివాస్ వనం, స్థానిక నాయకుడు క్రాంతి విజయకుమార్, వేణు, భాస్కర్ గౌడ్, వరుణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here