శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇన్‌చార్జి తరుణ్ చుగ్‌ను ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ నందకుమార్ యాదవ్, బీజేవైఎం నాయకుడు అందెల కుమార్ యాదవ్‌లు కలిశారు. తెలంగాణ పర్యటనలో ఉన్న తరుణ్ చుగ్‌కు వారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
