శేరిలింగంపల్లి, జూన్ 11 (నమస్తే శేరిలింగంపల్లి): భారతీయ జనతా పార్టీ హఫీజ్ పేట్ డివిజన్ అధ్యక్షుడు కైతాపురం జితేందర్ అధ్యక్షతన హుడా కాలనీలో డివిజన్ కార్యశాల (వర్క్ షాప్) సమావేశం నిర్వహించారు. హఫీజ్ పేట్ డివిజన్ లో బీజేపీ రాష్ట్ర , జిల్లా పార్టీ సూచన మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 11 ఏళ్లు సుపరిపాలన, యోగా దినోత్సవం, డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్, ప్రపంచ పర్యావరణ దినోత్సవం, ఎమర్జెన్సీ డే, మన్ కీ బాత్ ఇతర విషయాలపై ముందస్తు కార్యాచరణ చేపట్టారు.
ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర మహిళా నాయకురాలు వినయ, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి అజిత్ సేనాపతి, మాజీ కౌన్సిలర్ రమణయ్య, బీజేపీ జిల్లా గీతా సెల్ కన్వీనర్ రవి గౌడ్, బీజేపీ సీనియర్ నాయకులు దేవానంద్ యాదవ్, సత్యనారాయణ రాజు, పవన్ హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు , ప్రసాద్ పాత్రో , ప్రధాన కార్యదర్శి రాజు ముదిరాజ్ , డివిజన్ బీజేపీ మహిళా నాయకురాలు నిర్మల , కార్యదర్శి సుబ్బారావు , రాజు యాదవ్ , డివిజన్ బీజేపీ కార్యవర్గసభ్యులు రాజు గౌడ్ , ప్రభాకర్ రెడ్డి , రాంరెడ్డి , డివిజన్ బిజెపి నాయకులు పాలం శ్రీనివాస్ , నరసింహ యాదవ్ , శ్రీకాంత్ , పోలింగ్ బూత్ అధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు.