బిజెపి గ్రేటర్ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని విజయవంతం చేద్దాం

  • హఫీజ్ పేట్ డివిజన్ బిజెపి నాయకులు బోయిని అనూష మహేష్ యాదవ్

హఫీజ్ పేట్(నమస్తే శేరిలింగంపల్లి): భారతీయ జనతా పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆధ్వర్యంలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల సన్నాహక సమావేశంను విజయవంతం చేద్దామని హఫీజ్ పేట్ డివిజన్ బిజెపి నాయకులు బోయిని అనూష మహేష్ యాదవ్ దంపతులు పిలుపునిచ్చారు. ఓల్డ్ హఫీజ్ పేట్ కాయిదమ్మ కుంట చెరువు, కట్ట మైసమ్మ దేవాలయం వద్ద శనివారం సాయంత్రం 5:00 గంటలకు సమావేశం జరుగుతుందని, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జీ.కిషన్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొంటారని వారు తెలిపారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని జయప్రదం చేయాలని కోరారు.

హఫీజ్ పేట్ డివిజన్ బిజెపి నాయకులు బోయిని అనూష మహేష్ యాదవ్ దంపతులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here