బండి సంజయ్ పై దాడి హేయమైన చర్య : బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్

నమస్తే శేరిలింగంపల్లి:వరి కొనుగోలు కేంద్రాలను పరిశీలించి స్థానిక రైతులతో మాట్లాడాలని నల్లగొండ జిల్లా సూర్యపేట లో పర్యటించిన బిజెపి రాష్ట్ర అధక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కాన్వాయ్ పై టీఆర్ఎస్ నాయకులు దాడి చేయడం సరికాదని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. దాడికి నిరసనగా సూర్యాపేట జిల్లాకు వెళ్లేందుకు సిద్దమైన జ్ఞానేంద్ర ప్రసాద్ ను మియాపూర్ పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో పోలీసుల అక్రమ అరెస్టులపై మండిపడ్టారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ప్రతిపక్ష నాయకుల గొంతు నోక్కుతున్నారని వాపోయారు. రాష్ట్రంలో రైతాంగం ఇబ్బందుల్లో ఉన్న దృష్ట్యా వరి కొనుగోలు కేంద్రాల్లో పర్యటించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ నల్గొండ, సూర్యాపేట జిల్లాలలో వివిధ ప్రాంతాల్లో పర్యటించిన సందర్భంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు దాడి చేయడం పట్ల జ్ఞానేంద్ర ప్రసాద్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతారహిత్యం రాష్ట్ర ప్రజలకు తెలుస్తుందనే భావనతో దాడులకు పాల్పడడం సిగ్గుచేటు అని అన్నారు. బిజెపి సీనియర్ నాయకులు శ్రీధర్ రావు, రవి గౌడ్, వర ప్రసాద్, లక్ష్మణ్, రత్నకుమార్, చందు తదితర నాయకులను అరెస్ట్ చేసి మియాపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

జ్ఞానేంద్రప్రసాద్ ను ముందస్తుగా అరెస్టు చేసిన పోలీసులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here