శేరిలింగంపల్లి, అక్టోబర్ 2 (నమస్తే శేరిలింగంపల్లి): కాంగ్రెస్ పార్టీ ఇచ్చే ఆరు గ్యారెంటీల్లో ఒక సంక్షేమ పథకమైనా బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో అమలు చేసిందా అని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు బొల్లంపల్లి విజయ భాస్కర్ రెడ్డి ప్రశ్నించారు. ఏకకాలంలో రూ.2లక్షల రుణాలు మాఫీ చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న అక్కసుతో దొంగ దీక్షలకు బీజేపీ నేతలు దిగితే.. హైడ్రా పేరుతో కేటీఆర్ హైడ్రామా చేస్తున్నారని మండిపడ్డారు. ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ దేనన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా రెండు పార్టీలకు సిగ్గు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన చేస్తుంటే. స్థానిక సంస్థల ఎన్నికల మెప్పుకోసమే బీజేపీ, బీఆర్ఎస్ కలిసి నాటకం ఆడుతున్నాయన్నారు.