శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని గచ్చిబౌలిలో ఉన్న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ (నిథమ్)లో చెరువును ఆక్రమించి చేపట్టిన అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు. శేరిలింగంపల్లి మండల పరిధిలోని గచ్చిబౌలి సర్వే నంబర్ 71లో 3 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో రామమ్మకుంట చెరువు ఉంది. చెరువు ఎఫ్‌టీఎల్‌తో కలుపుకుంటే మొత్తం విస్తీర్ణం 5 ఎకరాలు అవుతుంది. అయితే ఈ చెరువు చుట్టూ నిథమ్ క్యాంపస్ ఉంది. కాగా కొన్నేళ్ల కిందట నిథమ్ యాజమాన్యం చెరువు బఫర్ జోన్‌లో కొత్తగా భవన నిర్మాణం చేపట్టింది. ఈ క్రమంలో చెరువును పూడ్చి ఆక్రమణ చేసి భవనాన్ని నిర్మించ తలపెట్టడంతో హెచ్ఆర్‌సీపీసీ కోర్టును ఆశ్రయించాయి. వివాదం కోర్టుకు చేరడంతో భవన నిర్మాణాన్ని మధ్యలోనే ఆపేశారు. అయితే ఇటీవలే హైకోర్టు సదరు భవనాన్ని కూల్చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో నిథమ్ యాజమాన్యం సదరు భవనాన్ని కూల్చివేసింది.