శేరిలింగంపల్లి, మే 3 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని డాక్టర్స్ రెడ్డీస్ కాలనీ, కృష్ణ సాయి ఎనక్లేవ్, జనప్రియ వెస్ట్ సిటీ, ప్రశాంత్ నగర్, న్యూ ప్రశాంత్ నగర్ కాలనీలలో రూ.2 కోట్ల 28 లక్షల 50 వేల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు, BT రోడ్ల నిర్మాణం పనులకు, పార్క్ ల అభివృద్ధి పనులకు కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, శేరిలింగంపల్లి నియోజకవర్గం, కాలనీ ల అభివృద్దే ధ్యేయంగా ప్రజల సౌకర్యార్థం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని, అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని అన్నారు. కాలనీల వాసులకు ఉపశమనం లభించిందని, మౌళిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని అన్నారు. సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు, కాలనీల అసోసియేషన్ సభ్యులు, మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.