మోదీ పాలనతో దేశ ప్రజలు విసిగిపోయారు – ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: దేశంలో బిజెపి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో రైతులు, సైనికులు, నిరుద్యోగులు, ఉద్యోగులు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ వాపోయారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ వచ్చిన సందర్భగా ఘన స్వాగతం పలికేందుకు ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఆధ్వర్యంలో నియోజకవర్గం టీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీగా వెళ్లారు. ఎమ్మెల్యే క్యాంపు నివాసం నుండి బేగంపేట వరకు కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, హమీద్ పటేల్, దొడ్ల వెంకటేష్ గౌడ్, జగదీశ్వర్ గౌడ్, నార్నె శ్రీనివాస రావు, ఉప్పలపాటి శ్రీకాంత్, పూజిత జగదీశ్వర్ గౌడ్, రోజాదేవి, మంజులరఘునాథ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సాయి బాబా తో కలిసి 1000 ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు.

టీఆర్ఎస్ బైక్ ర్యాలీని ప్రారంభిస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం తెలంగాణ రైతాంగం పట్ల నిరంకుశంగా వ్యవరించిందన్నారు. అధిక ధరలతో సామాన్యుడి నడ్డి విరిచిన అసమర్థ మోదీ పాల‌నలో అంతా తిరోగ‌మ‌న‌మే అని, ఏ ఒక్క‌రూ సంతోషంగా లేర‌న్నారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి య‌శ్వంత్ సిన్హాకు తెలంగాణ ప్ర‌జ‌లు, ప్ర‌జాప్ర‌తినిధుల త‌ర‌పున హృద‌య‌పూర్వ‌క‌ స్వాగ‌తం ప‌లుకుతున్నామ‌న్నారు. య‌శ్వంత్ సిన్హా ఉన్న‌త వ్య‌క్తిత్వం గ‌ల‌వార‌ని తెలిపారు. న్యాయ‌వాదిగా కెరీర్‌ను ప్రారంభించార‌ని, వివిధ హోదాల్లో దేశానికి అత్యుత్త‌మ‌ సేవ‌లందించార‌ని పేర్కొన్నారు. ఆర్థిక మంత్రిగా ప‌నిచేశార‌ని, ఆయ‌న‌కు అన్ని రంగాల్లో విశేష అనుభ‌వ‌ముంద‌ని తెలిపారు. భార‌త రాజ‌కీయాల్లో య‌శ్వంత్‌సిన్హాది కీల‌క‌పాత్ర అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు రంగారావు, రవీందర్ ముదిరాజ్, డివిజన్ అధ్యక్షులు సంజీవ రెడ్డి, రాజు యాదవ్, రఘునాథ్ రెడ్డి, సమ్మారెడ్డి, బాలింగ్ గౌతమ్ గౌడ్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, రాజు నాయక్, కృష్ణ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

శేరిలింగంపల్లి నుంచి బేగంపేటకు బయల్దేరిన టీఆర్ఎస్ నేతలు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here