మహేష్ కుమార్ గౌడ్ కు వినతి పత్రం అందించిన భేరి రామచంద్ర యాదవ్

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 29 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): రాబోయే ఎంపిటిసి, జెడ్పిటిసి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ జిహెచ్ఎంసి కార్పొరేటర్, కౌన్సిలర్స్, చైర్మన్ల ప‌ద‌వుల‌కు ఎన్నికలలో దామాషా ప్రకారం గ్రామీణ పట్టణ స్థాయిలో బీసీలకే సీట్లు కేటాయించాలని బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచంద్రర్ యాదవ్ అన్నారు. ఎక్కువ జనాభా ఉన్న బీసీలకే పట్టం కట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతూ బీసీ వాలా కోసం ఎన్నికలలో బీసీలకే సీట్లు వచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి విషయాలను రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బేరి సంతోషం వ్యక్తం చేస్తూ ఆయనను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా విద్యార్థి సంఘం నాయకులు నిరంజన్ యాదవ్, సందీప్ యాదవ్, కృష్ణ గౌడ్, రమేష్ ముదిరాజ్, పద్మశాలి సంఘం అశోక్, నాయి బ్రాహ్మణ సంఘం సాయిలు, రజక సంఘం కిషోర్, లెనిన్ యాదవ్, శశాంక్ యాదవ్, క్రాంతి కుమార్, సంతోష్ కుమార్, సంపత్ కుమార్ యాదవ్, యాదవ్ సంఘం, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here