శేరిలింగంపల్లి, జనవరి 1 (నమస్తే శేరిలింగంపల్లి): జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి నవీన్ యాదవ్ ను బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ కలిసి ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ నవీన్ యాదవ్ ఆయురారోగ్యాలతో జీవించాలని, కాంగ్రెస్ పార్టీ తరఫున అత్యధిక మెజార్టీతో గెలవడమే కాకుండా యాదవ సామాజిక వర్గానికి చెందిన బిసి నాయకుడు నవీన్ యాదవ్ కు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పదవి కేటాయించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో యాదవ్ సంఘం బీసీ నాయకులు అందెల కుమార్ యాదవ్, అశోక్ గౌడ్, కిరణ్ ముదిరాజ్, కుమార్ యాదవ్, పద్మశాలి సంఘం రమణ తదితరులు పాల్గొన్నారు.






