బీసీలు రాజ్యాధికారం వ‌చ్చే వ‌ర‌కు పోరాటం సాగించాలి: బేరి రామచంద్ర యాదవ్

శేరిలింగంప‌ల్లి, న‌వంబర్ 25 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెలంగాణ రాష్ట్ర బిసి ఐక్యవేదిక కార్యవర్గ నియామాకం విస్తరణలో భాగంగా కేపీహెచ్‌బీ కాలనీ తాతి వెంకటయ్య, వెంకట సుబ్బయ్యని అధ్యక్ష కార్యదర్శులుగా నియమించిన తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ వారికి నియామ‌క ప‌త్రాల‌ను అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా రామ‌చంద్ర యాద‌వ్ మాట్లాడుతూ బీసీలకు రాజ్యాధికారం వచ్చేవరకు అందరితోపాటు పోరాటం ఉద్యమంలో పాల్గొనాలని, కార్యవర్గానికి ప్రతి ప‌నిలో సహకరించాలని సూచించారు. అధ్యక్ష కార్యదర్శుల నియమాకం రెండు సంవత్సరంల పాటు ఉంటుంద‌ని, బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలను కలుపుకొని సేవ చేస్తూ సమస్యల పరిష్కారంలో భాగస్వామ్యులై అందరితో కలిసి పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ ముఖ్య నాయకులు, తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు భూమన్న యాదవ్, బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్, సెక్రెటరీ భ‌ట్టు రాజు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గిరి చారి, వెంకటయ్య పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here