టౌన్ ప్లానింగ్ అధికారి వెంకట రమణపై తక్షణమే విచారణ జరపాలి: రాగిరి సాయిరాం గౌడ్

శేరిలింగంప‌ల్లి, న‌వంబర్ 25 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి టౌన్ ప్లానింగ్ అధికారి వెంకట రమణపై తక్షణమే విచారణ జరపాల‌ని బీజేపీ యువనేత రాగిరి సాయిరాం గౌడ్ డిమాండ్ చేశారు. విజిలెన్స్ అధికారులు, అవినీతి నిరోధక శాఖ అధికారులు దీనిపై దృష్టి సారించాల‌ని ఆయ‌న అన్నారు. ఇటీవల కాలంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న టౌన్ ప్లానింగ్ అధికారి వెంకట రమణ అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తూ ఫిర్యాదులను బేఖాతరు చేస్తున్నాడ‌ని, అక్రమ నిర్మాణదారులకు అండగా ఉంటూ అక్రమార్జనకు పాల్పడుతున్నట్టు పలు వార్తా కథనాలు కూడా వస్తూ ఉండటం కూడా గమనార్హం అని, క‌నుక అవినీతి నిరోధక శాఖ, ghmc విజిలెన్స్ అధికారులు జోనల్ కమిషనర్ ఆయ‌న‌పై చట్టపరమైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here