శేరిలింగంపల్లి, అక్టోబర్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): బీసీ రిజర్వేషన్ల పరిరక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో టీపీసీసీ ఆధ్వర్యంలో పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ పిలుపుమేరకు 18వ తేదీన చేపట్టబోయే బీసీ బంద్ కు సంపూర్ణ మద్దతుగా కదిలి నడుద్దామని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ పిలుపునిచ్చారు. బంద్ సందర్భంగా 18వ తేదీన ఉదయం 10 గంటలకు చందానగర్‌లోని హుడా కేఫ్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు పాదయాత్ర నిర్వహించ తలపెట్టామని, ఇందులో అందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, కంటెస్టెడ్ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, డివిజన్ ఇన్చార్జులు, మైనారిటీలు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ ఎస్ యు ఐ నాయకులు,సేవాదళ్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.






