శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ సర్కిల్ పరిధిలో డిప్యూటీ కమిషనర్ శశిరేఖ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో PAC CHAIRMAN, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, బాలింగ్ గౌతమ్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మను అలంకరించి ఆడి పాడారు. అనంతరం ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, ప్రత్యేకతకు ప్రతీక అని అన్నారు. బాలింగ్ గౌతమ్ గౌడ్ మాట్లాడుతూ మహిళలు ఐక్యత, సాంప్రదాయం, విలువలు, సాంస్కృతిక, వారసత్వంగా బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం ఆనందదాయకం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గౌడ్ , వీరేందర్, మల్లేష్ గౌడ్ , కంది జ్ఞానేశ్వర్ , సంజయ్ , రాకేష్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






