శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రధాని నరేంద్ర మోడీ 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా కొనసాగుతున్న సేవా పక్షం కార్యక్రమాలలో భాగంగా మేరా దేశ్ పెహలే ది ఆన్టోల్డ్ స్టోరీ ఆఫ్ శ్రీ నరేంద్ర మోడీ పేరిట ప్రత్యేక ప్రదర్శన కోసం నిర్వహించిన సన్నాహక సమావేశం శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్ పరిధిలోని కిన్నెర గ్రాండ్ రెసిడెన్సీలో రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన కొనసాగింది. ఈ సమావేశంలో గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్, మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు, కార్పొరేటర్లు, మోర్చా నాయకులు పాల్గొని ప్రదర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రచార వ్యూహం, స్వచ్ఛంద కార్యకర్తల సమన్వయం వంటి అంశాలపై సమగ్ర చర్చ నిర్వహించారు.

ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ సెప్టెంబర్ 30వ తేదీన హైటెక్స్ ఎక్సిబిషన్ సెంటర్ లో మేరా దేశ్ పహలే – ది అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ శ్రీ నరేంద్ర మోదీ పేరిట ప్రధాని మోదీ జీవిత ప్రయాణాన్ని వర్ణిస్తూ రూపొందించిన ఓ అపూర్వమైన ప్రదర్శనను ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు.హైటెక్స్ ప్రదర్శనలో మోడీ బాల్యం, రాజకీయ జీవితం, దేశ అభివృద్ధిలో ఆయన చేసిన కృషి పై డిజిటల్ ఎగ్జిబిషన్, ఫోటో గ్యాలరీ, వర్చువల్ ప్రెజెంటేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్, మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాసరెడ్డి, జిల్లా అధ్యక్షులు మల్లా రెడ్డి, లంకాల దీపక్ రెడ్డి, భరత్ గౌడ్, రంగారెడ్డి జిల్లా అర్బన్ మాజీ అధ్యక్షుడు బుచ్చిరెడ్డి, సీనియర్ నాయకులు అంజన్ కుమార్ గౌడ్, కాంతా రావు, కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు మహిపాల్ రెడ్డి, బోల్గాం యశ్పాల్ గౌడ్, సేవా పక్షం జిల్లా ఇన్ఛార్జ్ రాధాకృష్ణ యాదవ్, వివిధ డివిజన్ ల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, మోర్చా నాయకులు తదితరులు పాల్గొన్నారు.





