మియాపూర్, సెప్టెంబర్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకొని
హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని జనప్రియా నగర్, జనప్రియ ఫోర్త్ ఫేజ్, ప్రకాష్ నగర్ కాలనీ, అంబేద్కర్ నగర్ కాలనీ, మదీనాగూడ కాలనీలలోని విఘ్నేశ్వరుని మండపాలలో నిర్వాహకులతో కలిసి బాలింగ్ గౌతమ్ గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రజలందరిపై ఆ గణేషుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాలనీవాసులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.