శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): గణపతి నవరాత్రి ఉత్సవాల లో భాగంగా వినాయక యూత్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు గోపనపల్లి వీకర్ సెక్షన్ కాలనీ లో నెలకొల్పిన గణపతి వద్ద బీజేపీ రంగారెడ్డి జిల్లా అర్బన్ కార్యదర్శి మూల అనిల్ గౌడ్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా గోపన్ పల్లిలో ఈ గణనాథుడిని దర్శించుకుంటున్నానని, ఇది తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. గ్రామంలోని ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతున్ని వేడుకుంటున్నానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకుడు అంజన్ కుమార్ గౌడ్, కమిటీ అధ్యక్షుడు జోగు జితేందర్, కృష్ణ,పెద్ద కృష్ణ, రాములు, దారుగు పల్లి రాజేష్, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.