నమస్తే శేరిలింగంపల్లి: కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాద్యమ బోధన జరుగుతుందని మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని మక్తా మహబూబ్ పేట్ విలేజ్ ప్రాథమిక పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో భాగంగా పాఠశాలలో చేరిన మొదటి తరగతి విద్యార్థులకు కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆంగ్ల మాద్యమ బోధనను ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించడం జరుగుతుందన్నారు. నిష్ణాతులైన ఉపాధ్యాయులతో ఉత్తమమైన బోధనను అందిస్తున్నట్లు తెలిపారు. పాఠశాలల్లో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ఎల్లవేళలా కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మల్లికార్జున్, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అయూబ్ పాషా, ఉపాధ్యాయులు రాజు, లక్ష్మీకాంతం, లక్ష్మి, రాజశ్రీ, రత్నం, తదితరులు పాల్గొన్నారు.
