శేరిలింగంపల్లి, నవంబర్ 11 (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ నేతాజీ నగర్ కాలనీ శ్రీ భగవతి రేణుక ఎల్లమ్మ నల్ల పోచమ్మ ఆలయ ప్రాంగణంలో అన్నదొరా స్వామి బసవమ్మ కన్య స్వామి కుటుంబ సభ్యుల అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఉమామహేశ్వర్ గురుస్వామి సమక్షంలో నిర్వహించిన ఈ పూజా కార్యక్రమంలో శేరిలింగంపల్లి కంటెస్టెడ్ ఎమ్మెల్యే, కార్పొరేటర్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి వి జగదీశ్వర్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్, నాయకుడు రాగం దయాకర్ యాదవ్, బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్, ఈశ్వరయ్య, మారుతి, కాలనీ నాయకులు, సభ్యులు, స్థానికులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వేముల కుప్పు స్వామి, ముద్దంగుల అన్న దొర , మల్లేష్ ముదిరాజ్ పాల్గొన్నారు.






