శేరిలింగంపల్లి, డిసెంబర్ 18 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని చందానగర్ డివిజన్ పరిధిలో ఉన్న చందానగర్ హుడా కాలనీ రైల్వే స్టేషన్ 2వ లైన్ హనుమాన్ ఆలయ వీధిలో శ్రీ అయ్యప్ప స్వామి మహాపడిపూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు జి.రోహిత్ ముదిరాజ్, జి.సాయిచరణ్ ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 20వ తేదీన శనివారం రాత్రి 7 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఇందులో గురుస్వాములు బాలు, శ్రీమణికంఠ భజన మండలి వాసగిరి ప్రసాద్ పాల్గొంటారని అన్నారు. పరిసర ప్రాంతాలకు చెందిన అయ్యప్ప స్వాములు, భక్తులు ఈ పూజలో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందాలన్నారు.





